కాలబుర్గి: ఇటీవల రిలీజైన దురంధర్ ఫిల్మ్‌లోని ఫా9లా సాంగ్(Dhurandhar song) ఎంత పాపులరో తెలిసిందే. ఆ హిట్ సాంగ్‌పై చాలా మంది రీల్స్ చేస్తున్నారు. తాజాగా కర్నాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత కూడా ఆ పాటపై డ్యాన్స్ చేశాడు. అయితే చేయిలో గన్ పట్టుకుని అతను డ్యాన్స్ చేయడం వివాదాస్పదమవుతున్నది. అఫజ్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంవై పాటిల్‌కు సన్నిహితుడైన మతీన్ పటేల్ తన డ్యాన్స్‌తో వివాదంలో ఇరుక్కుకున్నాడు. డ్యాన్స్ కోసం అతను ప్రదర్శిన ఆయుధాలపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీశారు.
ఓ పెళ్లి వేడుకలో వీడియో షూటింగ్ కోసం కాంగ్రెస్ నేత గన్ పట్టుకుని డ్యాన్స్ చేశాడు. అతని కుడి చేతిలో పిస్తోల్ ఉండగా, అతని వెంట ఉన్న మరో వ్యక్తి వద్ద మెషీన్ గన్ ఉన్నట్లు వీడియోలో ఉన్నది. వెడ్డింగ్ కోసం బ్లాక్ కలర్ యస్యూవీలో వచ్చిన అతను నేరుగా స్టేజ్‌మీదకు వెళ్లి చిందేశాడు. దురంధర్ ఫేమ్ సాంగ్‌పై స్టెప్పులేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. అయితే గన్ పట్టుకుని డ్యాన్స్ చేసిన వ్యక్తి కోసం ఆరా తీస్తున్నామని కాలబుర్గి పోలీసు కమీషనర్ శరణప్ప ఎస్ డీ తెలిపారు.
దురంధర్ ఫిల్మ్‌లో రెహ్మాన్ డకైత్ పాత్రలో అక్షయ్ కన్నా నటించారు. బ్లాక్ కలర్ యఎస్యూవీలో అతను బలోచిస్తాన్‌లోని ఆయుధ డీలర్ వద్దకు వెళ్తాడు. క్యాంపులోకి ఎంటర్ అవుతున్న సమయంలో అతను స్టెప్పులేస్తాడు. అయితే అదే స్టయిల్లో కర్నాటక కాంగ్రెస్ నేత స్టెప్పులేశాడు.
A display of “gun culture” by a #Congress leader in #Kalaburagi district has now become a major topic of debate.
A Congress leader named Mateen Patel, said to be a close associate of #Afzalpur Assembly constituency MLA #MYPatil, is at the center of the controversy after videos… pic.twitter.com/hFASTKkwuH
— Hate Detector 🔍 (@HateDetectors) February 10, 2026