నారాయణపేట : జిల్లాలోని కొత్తపల్లి మండలం దుప్పటి గట్టు గ్రామానికి చెందిన అనురాధ(37) అనే మహిళ కరెంట్ షాక్ ( Electric Shock ) తో మృతి చెందింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా గోడలకు నీరు పట్టి మోటార్ స్టాటర్ బటన్ ఆఫ్ చేసే క్రమంలో కరెంటు షాక్ తగిలి కింద పడింది.
స్థానికులు గమనించి ఆమెను హుటాహుటిన మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అనురాధ భర్త చిన్న మైబు గౌడ్ రెండు సంవత్సరాల కిందట మరణించారు. తల్లి మరణంతో ముగ్గురు చిన్నారులు అనాథులుగా మిగిలారు.