IND vs ZIM | మయాంక్ వికెట్ల వేట.. జడుసుకున్న జింబాబ్వే ఆటగాళ్లు..!
IND vs ZIM : తొలి టీ20లో భారత పేసర్ మయాంక్ యాదవ్(2-10) నిప్పులు చెరుగుతున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో మయాంక్ విజృంభణతో జింబాబ్వే టాపార్డర్ బ్యాటర్లు జడుకుకున్నారు.
IND vs ZIM : తొలి టీ20లో భారత పేసర్ మయాంక్ యాదవ్(2-10) నిప్పులు చెరుగుతున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో మయాంక్ విజృంభణతో జింబాబ్వే టాపార్డర్ బ్యాటర్లు జడుకుకున్నారు. ఓపెనర్ బ్రియన్ బెన్నెట్(0)ను తొలి ఓవర్లోనే డకౌట్ చేసిన ఈ స్పీడ్స్టర్.. ఆతర్వాత డియాన్ మోర్స్(6) ను పెవిలియన్ పంపి ఆతిథ్య జట్టును దెబ్బతీశాడు.
టాస్ ఓడిన జింబాబ్వేకు ఆదిలోనే షాకిచ్చాడు మయాంక్ యాదవ్. రెండేళ్ల తర్వాత టీ20ల్లో పునరాగమనం చేసిన మయాంక్ మొదటి ఓవర్లోనే డేంజర్ బ్రియాన్ బెన్నెట్(0)ను సున్నాకే ఔట్ చేశాడు. అదే ఊపులో మోర్స్(6)ను డగౌట్ చేర్చాడు. మరో ఎండ్లో ప్రిన్స్ యాదవ్, శివం దూబే చెరొక వికెట్ తీయగా 32కే నాలుగు వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. ప్రస్తుతం వెస్లీ మధీవెరె(3 నాటౌట్), రియాన్ బురి(10 నాటౌట్)లు ఆడుతున్నారు. 9 ఓవర్లకు స్కోర్ 40-4.
A comeback after two years, and Mayan looks in the mood. 🔥
He found the perfect line and length from the very first delivery, dismissing Zimbabwe’s best T20 batter, Brian Bennett, on the opening ball. 🎯#IndvsZim
pic.twitter.com/iMuotW5bVK— CricInformer (@CricInformer) July 23, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

