బిజినపల్లి : ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని పాలెం గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రమైన బిజినపల్లికి ( Bijinapalli Mandal ) చెందిన లక్ష్మమ్మ (46) గత బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వస్తానని చెప్పి మళ్లీ రాలేదన్నారు. అప్పటి నుంచి కుటుంబీకులు ఆమె కోసం వెతుకుతున్నారని వెల్లడించారు.
కాగా గురువారం ఆమె పాలెం పెంటోని చెరువులో మృతి చెంది కనిపించినట్లు తెలిపారు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను లక్ష్మమ్మగా గుర్తించారని వివరించారు. మృతురాలికి భర్త వెంకటయ్య తోపాటు ముగ్గురు సంతానం ఉన్నారని పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.