మూసాపేట, జూలై 8 : మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ గ్రామ పురవీధుల్లో ఎదురుగా వస్తున్న వారిని ఢీ కొడుతూ ప్రహరీలను కూలగొడుతూ భీభత్సం సృష్టించిన ఘటనపై సోమవారం రాత్రి పోల్కంపల్లిలో చోటు చేసుకున్నది. ఎస్సైతోపాటు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ పట్టణంలోని వీరన్నపేటకు చెందిన శంషొద్దీన్, షఫీ కలిసి పోల్కంపల్లి స్టేజీ సమీపంలోని వైన్స్ వద్ద సోమవారం రాత్రి సిట్టింగ్ చేసి మద్యం సేవించినట్లు తెలిపారు. అక్కడి నుంచి పోల్కంపల్లి గ్రామానికి చెందిన హబీబ్‌ను కలవడానికి శంషొద్దీన్ కారు నడుపుతూ బయలు దేరినట్లు తెలిపారు.
అప్కటికే పీకలదాకా మద్యం మత్తులో ఉన్న వారికి రోడ్డుపై వెళ్తున్న వారు కనిపించక వారిని ఢీ కొట్టేందుకు వెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వెళ్లారు. గ్రామ సమీపానికి వెళ్లగానే గ్రామానికి చెందిన గంజి శివరాములు భార్య స్వప్న(24) ఢీ కొట్టాడు. దీంతో ఆమె తీవ్ర రక్త గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అదేవిధంగా గ్రామానికి చెందిన బోల శ్రీశైలం కుమారుడు శివను ఢీ కొట్టాడు. దీంతో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. అదేవిధంగా ముందుకు వెళ్తు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రహరీలను ఢీ కొడుతూ వెళ్లాడు. గుర్తించి గ్రామస్తులు అతన్ని పట్టుకున్నారు.
అంతలోనే కారు నడుపుతున్న శంషోద్దీన్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నా డు. అతని కోసం గ్రామస్తులు మధ్య రాత్రి వర కు గ్రామం మొత్తం వెతికారు. అతని ఆచూకీ లభించకపోవడంతో షఫీని గ్రామస్తులు శంషోద్దీన్ ఎక్కడ ఉన్నాడో తెలపాలంటూ చితకబాదారు. విషయం తెలిసి మూసాపేట ఎస్సై వేణు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న ట్లు తెలిపారు. షఫీతో పాటు, కారును పోలీస్‌స్టేషనకు తరలించే ప్రయత్నం చేయగా గ్రామస్తులంతా తిరగబడి అడ్డుకున్నారు. విషయం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో భూ త్పూర్ ఎస్సై శేఖర్ తన సిబ్బందితో అక్కడి చేరుకున్నారు.
అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక పోలీస్ బలగాలు కూడా గ్రామం వద్దకు చేరుకున్నారు. గ్రామస్తులతో మూసాపేట, భూ త్పూర్ ఎస్సైలు మాట్లాడుతూ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడంతో గ్రామస్తు లు శాంతించారు. అక్కడి నుం చి షఫీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ప్ర మాదంపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అయితే గాయపడిన బాలుడు శివ మహబూబ్‌నగర్‌లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.