బాలానగర్: అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే టీఆర్ఎస్కు ఆదరణ లభిస్తోందని, వాటికి ఆకర్షితులయ్యే అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం హైదారాబాద్‌లోని స్వగృహంలో మండలంలోని ఉటుకుంట తండాకు చెందిన వివిధ పార్టీ నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్ మంజునా యక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేశారు.
\ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అనేక సక్షేమ పథకాలను ప్రారంభించి అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకూ పథకాలు అందుతున్నాయన్నారు. అదేవిధంగా ఉటుకుంటతండా టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడిగా ఎన్నికైన పురందాస్నాయక్ను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో విండో డైరెక్టర్ మంజునాయక్, నాయకులు పురందాస్నాయక్, శ్రీనునాయక్, రవినాయక్, వాల్యానాయక్, తదితరులు ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుళ్ల సురేశ్ అనే లబ్ధిదారుడికి సీఎం సహా యనిధి ద్వారా మంజూరైన రూ.1.50 లక్షల చెక్కును బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అందజేశారు. కార్య క్రమంలో మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు దశరథ్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నర్సింహులు, కోట్ల నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.