ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులు కాంగ్రెస్ నేతలు తలా తోక లేని ప్రకటనలపై ఉమ్మడి జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే గిన్ని మాట్లాడుతున్న ఆ పార్టీ అధికారంలోకి వ స్తే ఆగం కావాల్సిందేనని ఆందోళన చెందుతున్నా రు. వారెప్పుడైనా ఎవుసం చేశారా..? పంటలు పండిస్తే కష్టం గురించి తెలుస్తది.. వారు చెప్పే 3 గంటల కరెంట్ ఏ మూలకూ సరిపోదు. ఇక 10 హెచ్‌పీ మోటర్లతో ఆర్థిక భారం త ప్పదని వాపోతున్నారు. అందుకే వారికి ఓ టేస్తే కరెంట్ షాక్ తగలడం ఖాయమని హె చ్చరిస్తున్నారు. రేవంత్ నువ్వొద్దు.. నీ క రెంట్ వద్దు.. హస్తం పార్టీ మాటలు నమ్మి ఓట్లేస్తే ఎ న్కటి బాధలు తప్పవన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని, బీఆర్ఎస్కే ఓటేసి గెలిపిస్తామని మద్దతు పలుకుతున్నారు.
రేవంత్‌రెడ్డి నీకు వ్యవసాయం తెలుసా? ఊర్ల దగ్గర వ్యవసాయం చేసుకునేటోళ్లు 10హెచ్‌పీ మోటర్లు పెడతారు. అసలు నీకు అవగాహన ఉందా ..? అవగాహన లేక మాట్లాడుతున్నావా..? మూడు గంటలకు కరెంటు ఇచ్చి టెన్ హెచ్‌పీ మోటర్ పెట్టుకోమని అంటున్నావు.. ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నా మొత్తం మా జిల్లాలో పది మంది రైతుల వద్ద కూడా ఆ స్థాయిలో మోటర్లు లేవు. మీరు చెప్పే లెక్క ఏమిటో అర్థం అయిపోతుంది.. మళ్లీ పాత రోజులు.. కరెంటు లేని రాత్రులు గడిపేలా రైతులను నట్టేట ముంచే వ్యవహారం చేస్తున్నారు. ఇప్పటికే మూడు హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లు నడుస్తున్నాయి. 24 గంటల కరెంటుతో రైతులు ఆనందంగా మోటర్లను ఆన్ చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. 3 గంటల కరెంటు ఇస్తే ఈ మోటర్లు కూడా మూలన పడాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన మూడు గంటల్లో మోటర్లన్నీ స్టార్ట్ చేస్తే ట్రాన్స్ఫార్మర్లు తట్టుకుంటాయా..? సబ్స్టేషన్లు ఉంటాయా? 9 ఏండ్ల కింద కరెంటు లేని రాజ్యాన్ని మళ్లీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. రైతులంతా కలిసికట్టుగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలిసిపోయింది. కాంగ్రెస్ అధికారం ఇస్తే మళ్లీ పొలాల దగ్గర కరెంట్ షాక్‌లు, పాము కాట్లే.. ఇక రావద్దు మీ పాలన.
కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కష్టాలు మొదటికి వస్తాయి. గతంలో చూసినం పంటలు పండించడానికి కరెంటు లేక రాత్రి చేన్ల కాడికి పోయి నీళ్లు పెట్టడానికి పోయినప్పుడు ఎన్ని తిప్పలు పడ్డాం. పాములు, తేళ్లు విషకీటకాల బారిన పడి ఎంతో మంది చనిపోయారు. నిద్రమబ్బులు మోటర్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్‌తో చనిపోయిన ఘటనలు అనేక ఉన్నాయి. ఇప్పుడు ఆ బాధలన్నీ పోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల వద్ద ఉండి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇది కాంగ్రెసోళ్లకు నచ్చడం లేదనుకుంటా.. అందుకే మూడు గంటలు కరెంట్ చాలు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని ఇష్ట వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్లు ఏనాడైనా వ్యవసాయం చేసిన మొఖాలేనా.. ఏది పడితే అది అడ్డదిడ్డంగా వాగుతున్నారు. సీఎం కేసీఆర్ సార్ 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో యేటా రెండు పంటలు పండించుకుంటున్నాం. ఇక కాంగ్రెస్ వస్తే ఒక్క పంట కూడా పండించుకునే పరిస్థితి ఉండదు. అందుకే సీఎం కేసీఆర్ సార్కే మా ఓటు వేస్తాం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ కష్టాలతో రైతుల బతుకులు ఛిద్రమయ్యాయి. ఈ సారి ఎన్నికల మ్యానిఫెస్టోలో మోసపూరిత హామీలతో రైతులను బుట్టలో వేసుకునేందుకు తిరుగుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెబుతున్నాడు. ఇది హస్యాస్పదంగా ఉన్నది. కొన్ని బోర్లళ్ల నీళ్లు తక్కువగా ఉంటాయి. 3 గంటల కరెంట్ వస్తే కొద్దిగా నీళ్లు పోస్తుంది. అలా చేస్తే ఒక్కమడి కూడా తడవదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్‌తో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నాం. గతానికి, ఇప్పటికీ పంట విస్తీర్ణం బాగా పెరిగింది. ఉదయం పూట పొలానికి నీ ల్లు పెట్టి.. తర్వాత వచ్చి గ్రామంలో పిండి గిర్ని నడిపించుకుంటున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే వ్యవసాయం, పిండి గిర్ని ని కరెంట్ ఇబ్బందులు లేకుండా నడిపిస్తున్న. కాంగ్రెస్ పార్టీ మోసకారి మాటలు నమ్మే పరిస్థితిలో రైతులు సిద్ధంగా లేరు. రైతుల సంక్షేమం కోసం పనిచేసే సీఎం కేసీఆర్‌తోనే రైతుల బతుకులు బాగుంటాయి.
పదేండ్ల కింద పటేల్, పట్వారీల ఇండ్ల కాడ పోయి మా భూములు మాకు చూపియ్యమని చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చేది.. మాకు తెల్వకుండనే పాస్‌బుక్‌లో భూమి దిద్దుతుండ్రి.. ఏదన్నా అవసరం ఉందని భూమి అమ్మలి అంటే నీకు భూమి ఎక్కడిది అని దబాయిస్తుండ్రి.. ఎక్కడిది రా భూమి…? ఉంటే సుస్కోపో.. రికార్డ్ సూసి చెప్తా.. పొలం పోయి దున్ని రా.. మా ఇంట్లో జర పని ఉంది చేసిపో అంటుండ్రి.. అన్ని అయిపోయి భూమి మార్చుకున్నికే ముడ్నెల్లు, ఆరు నెలలు టైం పట్టేది.. అయినా ఆఫీస్‌లో లంచాలు ఇవ్వందే పని కాకుండే.. కాంగ్రెస్ పెద్దలు మళ్ల ధరణి తీసేసి పటేల్ పట్వారీ వ్యవస్థను తీసుకువస్తాం అంటున్నారు.. మల్ల రైతులు వాళ్ల దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా? మళ్లీ లంచాల రాజ్యం వస్తుంది.. మా భూములు మా కాకుండా పోతాయి.. ధరణి వచ్చాక మా పాస్ బుక్కులు మా దగ్గర ఉన్నాయి. భూమి ఎంత ఉంది అని ఎప్పుడు కావాలన్నా చూసుకునే వెసులుబాటు ఉంది. ఆర్వోఆర్లు, పహాణీల కోసం కార్యాలయాల్లో చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రేవంత్‌రెడ్డి కుటుంబం పటేల్ పట్వారీలు.. వాళ్ల ఇంటి ముందు కావాలి కాసే జనం ఇప్పుడు లేరని మళ్లీ పాత వ్యవస్థను తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది.. ఇలాంటి వ్యవస్థ మాకొద్దు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతాం..- శ్రీనివాస్‌గౌడ్, రైతు, అల్లీపూర్ గ్రామం, మహబూబ్‌నగర్ రూరల్ మండలం
రేవంత్‌రెడ్డి మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలంటున్నాడు. అలా ఇస్తే వ్యవసాయం పడావు పెట్టాల్సి వస్తుంది. వ్యవసాయం మీద అవగాహన లేక రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెసోళ్లు వస్తే మాకు నిద్రలేని రాత్రులే గతి. తెలంగాణలో ప్రస్తుతం రైతులం హాయిగా నిద్రపోతున్నాం. హస్తం పార్టీ వారి పాలనలో రాత్రి, పగలు మూడు గంటల చొప్పున కరెంట్ ఇచ్చారు. అప్పటి తిప్పలు మాకు మళ్లీ వద్దు. రేవంత్ రెడ్డికి రైతులందరం తగిన గుణపాఠం చెబుతాం. కేసీఆర్ వచ్చాకే రైతులంతా సంతోషంగా ఉన్నారు. మూడుగంటల కరెంట్ అన్న మాటల్ని కాంగ్రెస్ నాయకులు కూడా తప్పు పడ్తలేరు. అంటే కాంగ్రెస్ వస్తే రైతుకు కరెంట్ చుక్కలు తప్పవు. ఇప్పుడైతే పొద్దున తీసుకపోతే సాయంత్రానికి పొలంలో ఉంటది. అడ్డమైన మాటలు విని అత్యాశకు పోయి ఆగం కావొద్దు. రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి తెల్వదు. మూడు గంటల కరెంట్‌తో ఒక్క సాలు కూడా తడవదు. 10 హెచ్‌పీ మోటర్లు ఎవరు కొనాలి. కాంగ్రెసోళ్లకు రైతులు బాగు పడడం ఇష్టంలేదు. రైతులను ముంచడానికే వాళ్లు మళ్లీ మోపైనరు. మాకు రేవంత్‌రెడ్డి వద్దు.. కాంగ్రెస్ వద్దు.. సంక్షేమం కోరే కేసీఆర్ సారు వెంటే ఉంటాం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లో ఓల్టేజీ కారణంగా మోటర్లు మస్తు కాలిపోయేటివి. అప్పుడు మోటర్లు కట్టే పనిలో పడి తినడానికి కూడా టైం ఉండేది కాదు. పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడొద్దని రాత్రి, పగలు మోటర్లు కట్టే పని చేసేవాడిని. రైతులు మోటర్లు కాలిపోయి చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే ఏమీ చేయలేక వారు పడే బాధలు వర్ణణాతీతం. కానీ ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. నేను మోకానిక్ కంటే ముందు రైతును. నాకు మోకానిక్ పని ఉన్నా లేకున్నా వ్యవసాయం చేసుకోని హాయిగా బతుకుతాను. లోఓల్టేజీ సమస్య తీరడంతో మోటర్లు కాలిపోతలేవు. నిరంతరం నీళ్లు తోడి పంపులు మాత్రమే రిపేర్‌కు వస్తున్నాయి. అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ రైతులకు కరెంట్ సమస్యలు వచ్చినట్లే. ఈ మధ్య రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని మాట్లాడుతున్నాడు. ఇక్కడి రైతులు 3 హెచ్‌పీ లేదంటే 5హెచ్‌పీ మోటర్లు వాడుతున్నారు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటే రైతుల కష్టాలు రెట్టింపవుతాయి. కష్టం తెలిసిన సీఎం కేసీఆర్ అధికారంలో ఉంటేనే అందరికీ మేలు జరుగుతుంది.