నారాయణపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress government ) రైతుల పట్ల చిన్నచూపు చూస్తుందని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యస్ రాజేందర్ రెడ్డి ( Rajender Reddy ) అన్నారు. పండించిన ప్రతి గింజను కొనేంత వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని వెల్లడించారు.
శనివారం బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించి, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
వరి, మొక్కజొన్న, పప్పులు, నువ్వులు, చిరుధాన్యాలు సహా అన్ని పంటలకు సరైన ధర ఇవ్వాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి ఉద్యమం చేస్తుందని స్పష్టం చేశారు. పంజాబ్‌ను తలదన్నే స్థాయిలో పంటలు పండించి ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియా గా పేరొందిన తెలంగాణ రైతాంగం, ప్రస్తుతం కరెంట్, ఎరువులు, నీటి కొరతతో ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు.