గద్వాల, సెప్టెంబర్ 16 : భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు సహజం. ఇద్దరు కూర్చో ని క్షణికాలం పాటు ఆలోచిస్తే వందేళ్ల జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు. కానీ ప్రస్తుత మహిళలు అలా ఆలోచించడం లేదు. ప్రియుడి మో జులో పడి కట్టుకున్న భర్త తేజేజశ్వర్ను భార్య ప్రియుడితో కలిసి కడతేర్చిన ఘటన మరువక ముందే, భర్త వేధిస్తున్నాడని పడుకున్న భర్తపై వేడినూనె పోయగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో చోటు చేసుకున్నది.
గ్రామస్తులు, గద్వాల సీఐ శ్రీను తెలిపిన వివరాలు ప్రకారం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశ్(29)కు గట్టు మండలం బోయిలగూడెం గ్రా మానికి చెందిన పద్మతో ఎనిమిదేండ్ల కిందట వివాహామైంది, వీరికి ముగ్గురు సంతానం. గత నాలుగేండ్ల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. వీరి గొడవలు గ్రామ పెద్దల వరకు వెళ్లడంతో వారు కూర్చొని మాట్లాడడంతో కొంత వరకు సద్దుమణిగాయి.
భర్త వేధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడం ఈ నెల 10వ తేదీన మరో సారి వెంకటేశ్ భార్య పద్మమ్మను కొట్టడంతో విసుగు చెందిన ఆమె తెల్లవారు జామున మంచం మీ ద తమ పా పతో పడుకోగా పాప ను పద్మ పక్కకు పడుకోబెట్టి భర్తపై వేడివేడినూనెను పోసింది. దీంతో ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అటు నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూల్ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రా త్రి మృతి చెందారు. మల్దకల్ పోలీసులు కేసు నమో దు చేసి పద్మనును రిమాండ్కు తరలించారు.