లింగాల, డిసెంబర్ 23 : కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన నాగర్కర్నూల్ జి ల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై నాగరాజు కథనం మే రకు.. లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెంది న ముష్టి రాములు (41), ఎల్లమ్మ దంపతులు. అయితే మద్యం తాగేందుకు బానిసై ఉన్న పది ఎకరాల్లో 9 ఎకరాల ను విక్రయించాడు. ఈ విషయమై భార్యాభర్తలకు గొడవ జరిగేది.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న దంపతుల మధ్య మరోసారి తగువు జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భార్య ఎల్లమ్మ భర్త నిద్రిస్తున్న సమయంలో తలపై రోకలిబండతో మోదింది. అప్పటికీ మృతి చెందకపోవడంతో తర్వాత గొడ్డలితో న రికి చంపింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉ న్నారు. కేసు నమోదు చేసి, సీఐ రవీందర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఎ స్సై తెలిపారు.