గద్వాల, మే 23 : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే అధికారమని జోగుళాంబ గద్వాల జిల్లా సభ్య త్వ నమోదు ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు సన్నాహక స మావేశం కార్యక్రమంలో మెట్టు శ్రీనివాస్ సభ్యత్వ నమోదు గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆంజనేయ గౌడ్‌తో కలిసి హాజరై నాయకులు, కా ర్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. నడిగడ్డకు గులాబీ జెండా రక్షణ అన్నారు. నడిగడ్డలోని రెండు ని యోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే గ ద్వాల ఎమ్మెల్యే పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయాడని అతనికి ఈ సభ్యత్వ నమోదుతో గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రాబంధుల పాలన నడుస్తుందని చెప్పారు. ప్ర స్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పం డించిన పంటలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్‌కు రైతులు తెచ్చిన ధాన్యంపైనే కుప్పకూలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్టీకి 63లక్షల సభ్యత్వాలు ఉన్నా అధికారంలోకి రాలేకపోయామని చెప్పారు. సభ్యత్వ నమోదులో రాశి కంటే వాసి ఎక్కువగా ఉండాలని సూచించారు. క్వాలిటీ సభ్యత్వ నమోదు చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. ప్ర స్తుతం బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వాలు చేయడానికి పూనుకుందని, సభ్యత్వా లే పార్టీ పటిష్ట నిర్మాణానికి దోహదపడతాయన్నారు. నాలు గు నెలలు కష్టపడి పనిచేసి పూర్తిస్థా యి సభ్యత్వ నమోదు చేద్దామన్నారు. రాష్ట్రం మొత్తం కాం గ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నట్లు చె ప్పారు. రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్ర అస్థిత్వం ప్రమాదంలో పడిందని దీనిని మనం కాపాడేలా ప్రజా పోరాటలను ఉధృతం చేస్తే రేవంత్ కనుమరుగవుతాడని చెప్పారు. సభ్యత నమోదు తర్వాత సంస్థాగత ఎన్నికలు జరిపి కష్టపడి పని చేసేవారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలన్నారు.
పార్టీని కాపాడుకుంటే భవిష్యత్ మనదే : డాక్టర్ ఆంజనేయగౌడ్
పార్టీని కాపాడుకుంటే భవిష్యత్ మనదే అని బీఆర్ఎస్ స భ్యత్వ నమోదు గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆం జనేయగౌడ్ అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి భూ ములు కాజేస్తూ కేసీఆర్‌ను బూతులు తిట్టే పనిపెట్టుకున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ఎనుముల అన్నదమ్ములు లగచెర్ల మొదలుకొని ఆదిలాబాద్ వరకు భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. గద్వాల ఎమ్మెల్యే బావమర్దులు కృష్ణా, తుంగభద్ర నదుల్లో ఇసుకను తోడేస్తూ కోట్లు దోచుకుంటున్నారన్నారు. అక్కడ రేవంత్ దోపిడీని అన్నదమ్ములకు అప్పగిస్తే ఇక్కడ ఎమ్మెల్యే బావమర్దులకు అప్పగించాడని విమర్శించారు. గద్వాల ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యేకు ఈ సభ్యత్వ నమోదుతో గుణపాఠం చెప్పాలన్నారు. సభ్యత్వ నమోదులో అందరం కలిసికట్టుగా పనిచే సి రికార్డు సృష్టిద్దామన్నారు.
తెలంగాణ అస్తిత్వానికి రక్షణ కవచంగా నిలిచే విధంగా సభ్యత్వ నమోదు చేద్దామన్నారు. సభ్యత్వ నమోదులో సంస్థాగత నిర్మాణం పటిష్టత కోసం అందరం కృషి చేద్దామన్నారు. పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని దీనికి ప్రతి కార్యకర్త సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ గద్వాల ని యోజకవర్గ ఇన్చార్జి హనుమంతునాయుడు మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి స్థాయిలో చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గద్వాల నియోజకవర్గం సభ్యత్వ నమోదులో ముందు ఉండేటట్లు చేయడానికి నాయకులు, కార్యకర్తల సహకారం ఎంతో అవసరమన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు పులిపాటి వెంకటేశ్, సం టెన్న, మోహన్‌యాదవ్, గోపాల్, జగదీశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్, మాజీ జెడ్పీటీసీలు పద్మావెంకటేశ్వరరెడ్డి, బాసుశ్యామల, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, రాఘవేంద్రరెడ్డి, చక్రధర్‌రావు, మోనేశ్, కురువ పల్లయ్య, చిత్తారి కిరణ్, రఘు, రాము, రామకృష్ణతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.