కొల్లాపూర్ రూరల్, జూన్ 12 : కొల్లాపూర్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మార్కెట్లో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. గురువారం ఉదయం ‘నమస్తే తెలంగాణ’ మార్కెట్ యార్డును సందర్శించగా తడిసిన ధాన్యం కుప్పలు చూపించి రైతులు బోరున విలపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం విక్రయించేందుకు గత నెలలో కొల్లాపూర్ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చామని, అయితే అ ప్పుడు ధాన్యంలో తేమశాతం ఎక్కువగా ఉందని కాంటా వే యలేదన్నారు.
ధాన్యం తూర్పు పట్టడానికి అధికారులు తూ ర్పు మిషన్లు తెచ్చి తూర్పుపట్టడంతో మిషన్లలో వడ్లు నూకలు అవుతున్నాయని, ఆ నూకలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. కొన్ని రోజులుగా మార్కెట్లో ఉండి ధాన్యాన్ని ఆరబెట్టినా అధికారులు కాంటా వేయకుండా నిర్లక్ష్యం వహించడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుప్పులు పోసుకున్న ధాన్యం మొత్తం తడిసి పో యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత కేసీఆర్ ప్ర భుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూ డలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ క ష్టాలు మొదలయ్యాయని, గతంలో కల్లాల్లోనే ధా న్యం కొనుగోలు చేస్తే నేడు కల్లాల నుంచి మా ర్కెట్కు, మార్కెట్ నుంచి మిల్లులకు రైతులు వా హనాల్లో తీసుకుపోయినా ధాన్యం కొనే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. ఇప్పటికే వానకాలం సాగు పనులు ప్రారంభమైన నే పథ్యంలో అధికారులు స్పందించి ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు వెంటనే చే పట్టడంతోపాటు తడిసిన ధాన్యాన్ని కొ నుగోలు చేయాలని డిమాండ్ చేశారు.