జడ్చర్ల/భూత్పూర్/బాలానగర్/నవాబ్‌పేట, మే 2 : ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన అకాలవర్షాలతో అపారనష్టం వాటిల్లింది. జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఆరబెట్టిన, తూకాలు చేసిన ధాన్యం, మొక్కజొ న్న బస్తాలు తడిసిపోయాయి. పత్తి మార్కెట్ యా ర్డులో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. పాలమూ రు. బాలానగర్, గంగాపూర్, కోడ్గల్ తదితర గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. భూత్పూర్ మండలంలో కొనుగోలు కేం ద్రాల వద్ద ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి. పంటకోసం 20రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో తడిసిన ధాన్యంతో నిండా మునిగామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాలానగర్ మండలంలో గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వాన రై తులకు కడగండ్లు మిగిల్చింది. మండలంలోని గౌ తాపూర్, వనంవానిగూడ, బోడజానంపేట, హేమాజిపూర్, అప్పాజిపల్లి తదితర గ్రామాల్లో చేతికొచ్చిన 300ఎకరాల్లో వరి పంటలు నాశనమయ్యాయి. గౌతాపూర్‌కు చెందిన కళ్లెం శ్రీను కౌలుకు ఐదెకరాలు తీసుకొని సాగుచేయగా, మొత్తం ధాన్యం రాలిపోయింది. బాలానగర్, కేతిరెడ్డిపల్లి, గౌతాపూర్ గ్రా మాల పరిధిలో మామిడి తోటలకు నష్టం వాటిల్లిన ట్లు రైతులు తెలిపారు.
గౌతాపూర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, రైతు సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ 80శాతానికి పైగా వరిపంటలు పాడైపోయాయని, ప్రభుత్వం స్పందించి ఎకరాకు రూ.50వేల చొప్పు న పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవాబ్‌పేట మండలం దొడ్డిపల్లిలో గురువారం అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొన్నది. గాలివాన బీభత్సానికి ఒక్కసారిగా హైటెన్షన్ వైర్లు తెగి విద్యుత్ వైర్లపై పడటంతో కాలిపోయి మం టలు చెలరేగాయి. దీంతో మోటర్లు, స్టాటర్లు కాలిపో యి మంటలు వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శుక్రవారం ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది పునరుద్ధరణ పనులను చేపట్టారు. త్వరలోనే పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా ప్రారంభిస్తామని ట్రాన్స్‌కో ఏఈ సంతోష్‌కుమార్ తెలిపారు.