జడ్చర్ల, మే 24 : జడ్చర్లలో ఆదివారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున, సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌తోపాటు పత్తిమార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం కుప్పలు, బస్తాలతోపాటు మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. మొక్కజొన్న, ధాన్యం కోతలు జోరుగా కొనసాగుతున్న వేళ వారంరోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల వ్యవసాయ పనులకు ఆటం కం కలగడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు వ ర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మార్కెట్‌కు అమ్మకానికి తీసుకొచ్చి సరుకులు మార్కెట్లో కుప్పలు తడిసి పోవడమే కాకుండా మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన బస్తాలతో పాటు ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయాయి.
అదేవిధంగా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తీసుకొచ్చిన సరుకులతోపాటు వ్యాపారులకు చెందిన తూకం వేసిన బస్తాలు సైతం అకాల వర్షాలకు తడిసిపోయాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌తో పాటు పత్తిమార్కెట్లోని కొనుగోలు కేంద్ర వద్ద హమాలీ కొరత చాలా ఉంది. హమాలీలు రాకపోవడంతో బస్తాలు నింపడంతో పాటు తూకం చేసిన బస్తాలను ఎత్తడంలో పూర్తిగా ఆలస్యం జరుగుతుంది. దీనికి తోడు అకాల వర్షాలు కురుస్తుండటంతో సరుకులను కొనాలావద్దా అన్న మీమాంసలో వ్యాపారులు ఉన్నారు. సరుకులు మార్కెట్‌కు ఎక్కువగా రావడంతో వ్యవసాయ మార్కెట్లో టెండర్లతోపాటు తూకా లు ఆలస్యంగా జరుగుతుండటంతో తూకం వేసిన బస్తాలు మార్కెట్ ఆవరణలోనే ఉండిపోవడంతో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ను రోజు విడిచి రోజు విక్రయాలు జరుపుతున్నారు. వర్షాలు అటు రైతులను, ఇటు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ధాన్యం వర్షార్పణం
మహ్మదాబాద్, మే 24 : అధికారుల నిర్లక్ష్యానికి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం వర్షార్ప ణం అయ్యింది. ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయ్యింది. మండలంలో ని కొలిమికుచ్చ తండాలో ఏర్పాటు చచేసిన సబ్ సెంటర్లో వెయ్యి బస్తాలు నిల్వ ఉండడంతోపాటు కల్లంలో ధాన్యంతో నిండిపోయింది. ధా న్యం సే కరించి 20రోజులు అవుతున్నా సిబ్బంది నిర్లక్ష్యం తో ధాన్యం మొత్తం కల్లంలోనే ఉండి పో యింది. రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి వాటిని ఆరబెట్టి తూకం చేయించిన ఇప్పటివరకు ట్రక్ సీట్ ఇవ్వడం లేదని పలువురు రైతులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలో ధాన్యం వర్షం నీళ్లలో కొట్టుకు పోతుంటే రైతులు కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది.