బిజినేపల్లి : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు తప్పనిసరిగా అందుతాయని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ( MLA Rajesh Reddy) అన్నారు. శనివారం బిజినపల్లి మండల కేంద్రం రైతు వేదిక వద్ద రైతులకు స్ప్రింక్లర్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్( CMRF ) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని అన్నారు.
సబ్సిడీపై స్ప్రింక్లర్లు, రుణమాఫీ, రైతుబంధును ఇస్తుందని వివరించారు. రైతులు పండించిన వరి పంటను గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు, ప్రతి క్వింటాల్ కు రూ. 500 బోనస్ , పేదింటి ఆడపడుచుల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, రాములు, ఈశ్వర్, గోవిందు, పాండు నాయక్, రాము, శ్రీశైలం, బంగారయ్య, తిరుపతయ్య, శీను, శేఖర్, వెంకటేష్ గౌడ్, శివయ్య, పాషా , వేణు, మాన్య, కృష్ణ తదితరులు ఉన్నారు.