మరికల్ : మరికల్ మండల కేంద్రంలోని పురాతన శివాలయ ( Shiva temple) అభివృద్ధికి చేయూతను అందిస్తామని ఎన్ఆర్ఐ బసవకుమార్ (NRI Basavakumar0 , మహానందిశ్వర్లు అన్నారు. శనివారం మరికల్ మండల కేంద్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఎంతో మహిమాన్విత గల ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించడంతోపాటు గ్రామ అభివృద్ధికి కూడా తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ సంఘం సభ్యులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీరసేవ లింగాయత్ అధ్యక్షుడు జగదీష్, బస్వరాజ్, వీరన్న, బసంతు, అయ్యప్ప, వీరభద్రప్ప, మహేష్, చంద్రశేఖర్, శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.