మరికల్, జనవరి 11: దేశంలో కార్పొరేట్ సంస్థలకు గులాంగిరి చేస్తున్న బీజేపీ సర్కార్‌ను గద్దెదించడం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని, నాడు ఆంధ్రపాలకుల నుంచి విముక్తి కోసం టీఆర్ఎస్ ఆవిర్బవిస్తే, నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నుంచి విముక్తి కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి ఆన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పార్టీ మారిన తర్వాత నారాయణపేట జిల్లాలో మొదటి జెండాను మరికల్లో ఆవిష్కరించడం జరిగిందన్నారు. దేశంలో రైతులు పడుతున్న కష్ట్టాలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమ కోసం రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టడం జరిగింద న్నారు. ఈ సారి ఢిల్లీ గడ్డ పై గులాబీ జెండాను ఎగురవేసి దేశ వ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్‌తో పాటు రైతుబంధు, రైతుబీమా తదితర సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు ఆందివ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం ప్రతి రైతు కుటుంబానికి చేరాలని సూచించారు.
గతంలో ఎంతో వెనుకబడిన నారాయణపేట నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఇదీ ఆనే విధంగా అభివృద్ధి ప నులు చేయడం జరిగిందని, ఇంకా అభివృద్ధి చేస్త్తానని, అభివృద్ధ్ది రుచి చూపిస్తానన్నారు. మరికల్‌ను మండల కేంద్రం గా మార్చడంతోపాటు మరికల్లో అభివృద్ధికి ఆటంకం కల్గిస్తున్నా మండల అభివృద్ధికి కృషి చేస్తున్నానని, మండలానికి కేజీబీవీ వస్తే ఇక్కడ నిర్మాణం జరుగకుండా అడ్డుపడ్డా పస్పులలో నిర్మాణం జోరుగా జరుగుతుందన్నారు. అలాగే వ్యవసాయ గిడ్డంగులు వస్తేకూడా నిర్మాణం పనులు అడ్డుకున్నా ఎలిగండ్లలో నిర్మాణం చేస్తామని, మండల కేంద్రం లో మండల కాంప్లెక్స్ వచ్చిందని, దానికి 449 సర్వే నెంబర్ ఎదురుగా 5ఎకరాల స్థలం చూడడం జరిగిందని, 7కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మండల కాంప్లెక్స్ నిర్మాణం మరికల్లో జరుగుతుందని, సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభం అవుతాయన్నారు. ధన్వాడలో తాసిల్దార్ కార్యాలయ నిర్మాణం, పోలీస్‌స్టేషన్ నిర్మాణం, డీగ్రీ కళాశాల ఏర్పాటు తదితర ఆభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
బీజేపీ నాయకులకు దమ్ముంటే పాలమురు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. పనులను అడ్డుకుంటూ అభివృద్ధ్దికి అడ్డుపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కనువిప్పు కలిగేలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఐదు రిజర్వాయర్లు పూర్తి కావడం జరిగిందని, కాల్వల నిర్మాణం పనులకు ప్రతిపక్ష నాయకులు అడ్డుపడుతున్నారన్నారు.
కిష్టిపూర్ గ్రామానికి చెందిన మండల మాజీ అధ్యక్షులు యుగేంధర్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సునీ ల్‌కుమార్‌రెడ్డి ప్రచురించిన క్యాలెండర్‌ను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి, రైతుబంధు చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు. కార్యక్రమంలో నారాయణపేట జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, వైస్‌ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ కస్పే గోవర్ధన్, ఎంపీటీసీలు సుజాత, గోపాల్, మండల కోఆప్షన్ సభ్యుడు మతీన్, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్సంపత్కుమార్, సీనియర్ నాయకుడు రాజవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతయ్య, పట్టణ ఉద్యోగులు చంద్రశేఖర్, పార్టీ ధన్వాడ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డితోపాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, జనవరి 11: బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధ్దిని చూసి ఇతర పార్టీలవారు బీఆర్ఎస్లో చేరుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మరికల్ మండలం ఇబ్ర హీంపట్నం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు, శివతోపాటు 30 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.