కోసి ్గమే 9 : పట్టణంలో రూ.10కోట్లతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని, రెండు కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అంతకుముందు పాతరగడ్డ ఆంజనేయ ఆలయ సమీపంలో రోడ్డును పరిశీలించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు పనులు చేపట్టాలని తెలిపారు. అనంతరం శాసం కాలనీలో పాతబావి స్థలాన్ని పరిశీలించారు. జర్నలిస్టుల కాలనీ కోసం ప్లాట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కూరగాయల షెడ్లు, డ్రైనేజీలు, రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి మరిన్ని నిధులు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. కోస్గి ప్రభుత్వ దవాఖాన పనులు త్వరగా పూర్తి చేసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావ్తో ప్రారంభిస్తామన్నారు. పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, మరింత పట్టుదలతో చదివి మున్ముందు మరింత బాగా రాణించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ శాసం రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, జెట్పీటీసీ ప్రకాష్‌రెడ్డి, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.