నారాయణపేట రూరల్, సెప్టెంబర్ 18 : మండలంలోని ఊటకుంట తండా గ్రామ పంచాయతీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. నెల నుంచి తండాకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదని స్థానికు లు వాపోయారు. కేవలం వారంలో ఒకటి, రెండ్రోజు లు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని, దీంతో వ్య వసాయ బోర్ల వద్దకు మహిళలు పరుగులు పెడుతున్నారు.
ఈ విషయమై లైన్మెన్ దృష్టికి తీసుకెళ్లినా ప్రె షర్ తక్కువగా ఉన్నదని, అందుకే సక్రమంగా సరఫ రా కావడం లేదని చెబుతున్నారని మాజీ సర్పంచ్ సీతమ్మావెంకట్నాయక్, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల్లో పరిష్కరించకుంటే ఎంపీడీ వో కార్యాలయం, ప్రధాన రహదారిపై ఖాళీ బిందెల తో ధర్నా చేపడుతామని హెచ్చరించారు. ఎంపీడీవో ను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.