పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా కొరవడింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెప్రగతితో గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే పట్టింపు కరువైంది. దీంతో ఎక్కడకక్కడ చెత్త పేరుకుపోవడం.. రోడ్లపైనే మురుగు నీరు నిల్వ ఉండడం దర్శన మిస్తున్నాయి. తీవ్ర అపరిశుభ్రతతో ఇదే కోవలోకి గద్వాల జిల్లా కాకులారం చేరింది.
గ్రామంలోని వీధులు, రోడ్లను చూస్తే మురికి కూపంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు స్వైరవిహారం చేస్తున్నాయి. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ.. దృష్టి సారించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగంతా రోడ్లపైనే పారుతున్నదని, ఇప్పటికైనా చర్య లు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.