వనపర్తి రూరల్, ఫిబ్రవరి 15 : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మ హరాజ్ చూపిన మార్గం ఆదర్శనీయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాజపేట గ్రామశివారులో జిల్లా గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ ప్రతి గిరిజన బిడ్డ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం గిరిజనులు పాటుపడాలని సూచించారు. ఆయన చూపిన మార్గంలో పయనించాలని పిలుపునిచ్చా రు. గిరిజనుల కట్టూబొట్టూ, వారి సంప్రదాయం ప్రత్యేకమైనదిగా కొనియాడారు. జిల్లాలోని గిరిజన యువతీ యువకులు దాదాపుగా 15 మంది ఎంబీబీఎస్ సీట్లు, ఆరుగురు ఐఐటీ ఇంజినీరింగ్ సీట్లు సా ధించడం గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తం డాలను వారే అభివృద్ధి చేసుకొనేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని చె ప్పారు. ఇప్పుడు తండాలు ఎలా పురోగమిస్తున్నాయో మన కండ్ల ముందు కనిపిస్తుందన్నారు. గిరిజనుల ఉన్నత విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. విదేశీ విద్యను అభ్యసించడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. వారందరినీ సన్మానించడం గిరిజన జాతికి గర్వకారణమని అన్నారు. అలాగే జిల్లా శివారులోని ప్రభుత్వ భూమిలో అర ఎకరా స్థలం గిరిజన భవన నిర్మాణానికి కేటాయించగా.. అందుకు సంబంధించిన ప్రొసీడింగ్‌ను గిరిజన నాయకులకు అందజేశారు. అంతకుముందు సంత్‌సేవాలాల్ పూజా కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర నేత కోళ్ల వెంకటేశ్, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్ కురుమూర్తి యాదవ్, నాగవరం సహకార సంఘం చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు జాత్రునాయక్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యుడు నారాయణ నాయక్, ఎంపీటీసీ ధర్మనాయక్, జయరాం నాయ క్, బిచ్యానాయక్, తారాబాయి, అర్జున్‌నాయక్, శ్రీధర్ నాయక్, చంద్రు నాయ క్, ఘణపుర్ ఎంపీపీ కృష్ణానాయక్, పీన్యానాయక్, సూర్యానాయక్, గోపాల్ నాయక్, నాయకులు పాల్గొన్నారు.