వనపర్తి, డిసెంబర్ 6 : దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించడంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి ఎనలేనిదని వ్య వసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం అంబేద్కర్ 65వ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని మం త్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. అంబేద్క ర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలి సి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ జీవితాంతం కృ షి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక మా ర్పు కోసం ప్రయత్నం చేయాలన్నారు. సమసమాజ స్థాపనతోనే అంబేద్కర్‌కు నిజమైన నివాళులర్పించినట్లు అవుతుందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి న్యాయశాస్త్ర కోవిదుడుగా పేరొందార న్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు నారాయణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధా న కార్యదర్శి ఆవుల రమేశ్, టీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ హేమంత్, నాయకులు రహీం, జోహెబ్, వెంకటేశ్ ఉన్నారు.
దాతలు ముందుకురావాలి..
గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలంటే దాతలు ముందుకు రావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. సోమవారం మండలంలోని అంకూర్ గ్రామ శివారులో స్వాతంత్య్ర సమరయోధు డు కొండా నారాయణరెడ్డి స్మారకార్థం ఆయన కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన గ్రామీణ పశువైద్యశాల భవనాన్ని నా రాయణరెడ్డి సతీమణి రోహిణిదేవితో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాత లు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన వసతులను సమకూర్చితే అభివృద్ధికి తోడ్పాటునందించిన వారవుతారన్నారు. రైతులు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని బాధితులు కొత్త శ్రీనివాస్‌రెడ్డికి రూ.2 లక్షలు, గొల్ల శ్రీశైలానికి రూ. 80 వేల ఎల్వోసీలను వారి ఇండ్ల వద్దకు వెళ్లి మంత్రి అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎంపీటీసీలు రంగారెడ్డి, ధర్మానాయక్, సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మీదేవమ్మ, ఉపసర్పంచ్ గోపాల్‌రెడ్డి, శ్రీదేవి, సుధాకర్‌రెడ్డి, రవిప్రకాశ్‌రెడ్డి, వెంకటయ్య, దామోదర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, వనపర్తి సహకార సంఘం చైర్మన్ వెంకట్రావు, నాయకులు రమేశ్‌గౌడ్, తిరుమల్ నాయుడు, మాణిక్యం ఉన్నారు.