వనపర్తి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలును నిర్వహించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో ఉదయం 4.20 గంటలకు స్వామి వారి పల్లకి సేవ, కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం శ్రీ రంగపురం మండల కేంద్రంలోని రంగనాథ ఆలయంలో రంగనాథ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి నిరంజన్ రెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
స్వామి తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.