మక్తల్ టౌన్, ఏ ప్రిల్ 22 : పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతో నేడు ఎక్క డ చూసినా కృష్ణమ్మ ప రవళ్లు, పచ్చని పంటపొలా లే దర్శనమిస్తున్నాయని ఎక్సై జ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం మ క్తల్ పట్టణంలో ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డితో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రా రంభోత్సవాలు చేశారు.
మినీట్యాంక్ బండ్‌పై రూ.1.40 కోట్లతో నిర్మించనున్న పార్క్‌కు భూమిపూజ చేసి మోడల్ మ్యాప్‌ను పరిశీలించారు. కర్ని రోడ్డులో రూ.47.50 లక్షలతో నిర్మించిన డంపింగ్ యా ర్డును, రూ.47.50 లక్షలతో నిర్మించిన సమీకృత మార్కెట్, మున్సిపల్ కార్యాలయంలో పురపాలక సమావేశ భవనాన్ని ప్రారంభించారు. తడి, పొడి చెత్త నిర్వహణలో ఉపయోగపడే ఇన్సినిరేటర్, వేస్ట్ ష్రెడ్డర్, కోకోపీట్ ను పరిశీలించారు. అలాగే రూ.2 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటె డ్ మార్కెట్ నిర్మాణానికి భూమిపూజ చేసి, డిజైన్‌ను పరిశీలించా రు. సమీకృత మార్కెట్ వద్ద వ్యా పారస్తులతో ముచ్చటించారు.
అనంతరం మున్సిపల్ సమావేశ భ వనంలో ఏర్పాటు మీడియా స మావేశంలో మంత్రి మాట్లాడారు. సమైక్య పాలనలో మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. నేడు సీఎం కేసీఆర్ పాలన లో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. ఎమ్మెల్యే చిట్టెం పంపిన ప్రతిపాదనలకు సీఎం అనుమతులు మంజూరు చేస్తున్నారన్నారు.
మక్తల్ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మం జూరయ్యాయన్నారు. కౌన్సిలర్లు తమ వార్డులను అభివృద్ధి చే సుకోవాలన్నారు. ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ విబేధాలు లే కుండా అందరం కలిసిమెలిసి పనిచేయాలని తెలిపారు. మున్సిపాలిటీలో పార్క్, డంపింగ్ యార్డు, సమీకృత మార్కెట్, కౌ న్సిల్ హాల్ తదితర పనులు చేపట్టామన్నారు. కొత్త మున్సిపల్ కార్యాలయానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
సమస్య లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజ, అదనపు కలెక్టర్ పద్మజారాణి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మున్సిపల్ చైర్పర్సన్ పావని, వైస్ చైర్పర్సన్ అఖిల, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ నర్సింహ, ఏఈ నాగశివ, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.