వనపర్తి, సెప్టెంబర్ 30 : దేశానికి వెన్నెముక అయిన రైతన్న కుటుంబం వీధిన పడకూదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు భరోసానిస్తున్నది. అన్నదాతలు అకాల మరణం చెందినా.., ప్రమాదంలో మరణించినా వారి కుటుంబాలు వీధిన పడేవి. ఈ క్రమంలో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తరువాత రైతు సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. అందులో భాగంగా రైతు అనారోగ్యంతో లేదా ఇతర కారణాలతో మరణిస్తే సదరు రైతు కుటుంబానికి బీమా పథకం ఆసరాగా నిలుస్తున్నది. పథకం ప్రారం భం నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,717 మంది రైతులు మృతి చెందగా.. 1,631 మందికి రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని అందజేశారు.
రైతు కుటుంబాలకు బీమాతో భరోసా..
సన్నకారు రైతులు అత్యధికంగా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబాల్లో రైతులు చనిపోతే కనీసం రోజువారి ఖర్చులు కూ డా వెళ్లలేని దుస్థితి. రైతు బీమాపథకం ద్వారా బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి 18 నుంచి 58 ఏండ్ల వయస్సు ఉన్న ప్రతి రైతుకూ బీమా వర్తింపజేస్తున్నారు. రైతుపై భారం పడకుండా ప్రభుత్వమే రూ.3,400 ప్రీమియా న్ని ఎల్ఐసీ వారికి చెల్లిస్తూ రైతులకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తున్నది.
దళారుల ప్రమేయం లేకుండా..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం లో విధివిధినాలను పకడ్బందీగా రూ పొందించారు. దళారుల ప్రమేయం లేకుం డా, రైతులకు పైసా ఖర్చుకాకుండా పరిహారం అందేలా చూ స్తున్నారు. రైతు మృతి చెందిన వెంట నే సంబంధిత ఏవో పూర్తి వివరాలు, మర ణ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీంతో రైతు మరణించిన పది రోజుల్లో నామినీ అకౌంట్లో డబ్బు జమ చేస్తున్నారు.
వివరాల నమోదు పూర్తి చేశాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పేట జిల్లాలో వరి పంట సాగు వివరాలు నమోదు చేశాం. ఈ నెల 30 వరకు పది రోజుల పాటు సర్వే జరిగింది. జిల్లాలో వరి సాగు చేసిన ప్రతి రై తు వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సర్వేలో ఎంత మంది రైతులు ఎ న్ని ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు..? ఎంత దిగుబడి వస్తుంది..? దిగుబ డి వచ్చిన ధాన్యంలో ఎంత మేర రైతులు తమ సొంత అవసరాలకు వాడుకుంటారు, ఎంత విత్తనం కోసం దాచుకుంటారో వెల్లడైంది. ఎంత ధాన్యం మార్కెట్లోకి వస్తుందనే లెక్క తెలుస్తుంది.