వనపర్తి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అనే నానుడి ఉండేది. ప్రభుత్వ దవాఖానకు వెళ్తే తిరిగి వస్తామో లేమో అన్న భయం ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సర్కారు ద వాఖానల బలోపేతంపై దృష్టి సారించారు. కా ర్పొరేట్కు మించి వైద్య సేవలందేలా చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా వనపర్తి జి ల్లా దవాఖానలో పూర్తి స్థాయి వైద్య సేవలందుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృషితో నిధులు సమకూర్చుకోగా.. కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా ప్రత్యేక చొరవతో అన్ని రకాల వైద్య పరికరాలు అం దుబాటులోకి వచ్చాయి. పేద, ధనిక తేడా లేకుండా అందరూ ప్రభుత్వ వైద్య సేవల కోసం క్యూ కడుతున్నారు. స్పెషలిస్టు డాక్టర్లు ఉండడం, ప్రత్యేక ల్యాబ్‌లు, ఎమర్జెన్సీ సేవలందిస్తుండడంతో రోగులు జిల్లా దవాఖానకు వస్తున్నారు. పాలియేటివ్ కేర్, డయాలసిస్ సెంటర్, డయాగ్నొస్టిక్ సెంటర్, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు. సాధారణ కాన్పులు, సిజేరియన్ వి షయంలో కూడా జిల్లా దవాఖాన ముందు వరుసలో ఉన్నది. కేసీఆర్ కిట్‌తో పాటు ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు అందిస్తుండడంతో గర్బిణులు ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారు. ప్రతి నెలకు గర్బిణుల రాక పెరుగుతూనే ఉన్నది. రోగుల సేవలను దృష్టిలో ఉంచుకొని మంత్రి నిరంజన్‌రెడ్డి మూడు అంబులెన్సులను అందజేశారు. వనపర్తి జిల్లా దవాఖానలో ఆర్టీపీసీఆర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రూ.1.16 కోట్లు వెచ్చించి ప్రత్యేక మిషన్ సమకూర్చారు. నిత్యం 500 మందికి కరోనా పరీక్షలు చేయడంతోపాటు మూడు గంటల్లోనే రిపోర్టు అందిస్తున్నారు.
బస్తీ దవాఖానలు..
సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు బస్తీ దవాఖానలు సేవలందిస్తున్నాయి. స్త్రీలకు, క్యాన్సర్, టీబీ వంటి రోగులకు రోజుకో స్పెషలిస్టు డాక్టర్ చొప్పున అందుబాటులో ఉంటున్నారు. పిల్లల, కీళ్ల వైద్య నిపుణులు కూడా ఉన్నారు. ఒక్కో వైద్యుడికి రోజుకు ప్రభుత్వం రూ.3 వేలు అందజేస్తున్నది. ఆదివారం, గురువారం స్త్రీ వ్యాధి నిపుణులు, మంగళవారం, శుక్రవారం పిల్లల డాక్టర్, బుధవారం జనరల్ డాక్డర్లు అందుబాటులో ఉంటారు.
డయాగ్నొస్టిక్ సెంటర్..
డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా నిత్యం రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 కేంద్రాల్లో ఓపీకీ వచ్చిన రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించి.. ప్రత్యేక వాహనంలో గద్వాలలోని తెలంగాణ డయోగ్నొస్టిక్ సెంటర్‌కు పంపిస్తారు. అదే రోజు సాయంత్రం వరకు మెయిల్ ద్వారా రిపోర్టులు ఇస్తున్నారు. మొత్తం 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. పరీక్షలు ఉచితంగా చేయడంతో పేదలపై ఆర్థిక భారం తప్పడ మే కాకుండా నిర్ధిష్టమైన వైద్య సేవలు అందిస్తున్నారు.
పాలియేటివ్ కేర్..
క్యాన్సర్, మధుమేహం, పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలిగించే పాలియేటివ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. షుగర్ వ్యాధితో పుండ్లు అయినవారు, కాలేయం, ఉపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కేర్ ఎంతో ఉపయోగపడుతున్నది.
డయాలసిస్ సెంటర్..
కిడ్నీ సంబంధిత రోగులకు చికిత్స అందించేందుకు 10 పడకలను ఏర్పాటు చేశారు. నిత్యం 40 మంది రోగులు డయాలసిస్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఉచితంగా వైద్య సేవలు..
ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం. అంబులెన్స్‌లు, ల్యాబ్‌లు, బెడ్లు ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఉ న్నాయి. వైద్యులు బాధ్యతగా సేవలందిస్తున్నారు. మెరుగైన చికిత్స అందించడమే కాకుండా కాన్పు లు జరిపిన తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. అన్ని రకాల చికిత్సలు, అవసరమైన ల్యాబ్‌లు, వైద్యు లు అందుబాటులో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ అభినందనీయం.
అన్ని సౌకర్యాలు కల్పించాం..
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమం వంటి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నది. అందులో భాగంగానే ప్రభుత్వ దవాఖానల్లో అ న్ని వసతులు సమకూరుస్తున్నది. కొవిడ్ పరీక్ష కోసం ఆర్టీపీసీఆర్ సేవలు, పాలియేటివ్ కేర్ సెంటర్, డయాలసిస్ కేంద్రం, 57 రకాల పరీక్షలు ఉచితంగా జరిపే డయాగ్నొస్టిక్ సెంటర్, బస్తీ దవాఖాన వంటి సేవలు అందుబాటులో తెచ్చాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యం.