వనపర్తి, మార్చి 10 : శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గట్టుయాదవ్ మాట్లాడారు. కారు గుర్తు మీద గెలిచి పదవులను అనుభవిస్తూ.. పార్టీకి రాజీనామా చేస్తున్నామం టూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. వారంతా పార్టీకి కాదు.. పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. వనపర్తికి నీళ్లు తెచ్చాన ని కాల్వను తవ్విన కాంట్రాక్టర్ చెబుతున్నాడని.. ఇదంతా చూస్తే భ జంత్రీలు వాయించడానికి వచ్చిన వ్యక్తి తానే పెండ్లి చేశానని అన్నట్లు ఉందన్నారు. అసంతృప్త నేతలు చీకటి రాజకీయాలు మానుకోవాల ని, మీరు ఏ కండువా కప్పుకొంటారో మీకైనా క్లారిటీ ఉందా అంటూ ప్రశ్నించారు. మీ నాటకాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్ర త్యేక రాష్ట్రం కోసం జెండా పట్టిన వ్యక్తి.. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అని అన్నారు.
కౌన్సిలర్, సర్పంచ్ స్థాయి వ్యక్తులను తీసుకొచ్చి జెడ్పీ చైర్మన్, ఎంపీపీలను చేశారని, అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెట్టడం అంటే ఇదేనని పేర్కొన్నారు. పదవులను అనుభవిస్తూ మంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ‘ప్రాణం పోయినా మంత్రి నిరంజన్‌రెడ్డిని వదిలిపెట్టను.. ఆయన నా దేవుడు’ అని ప్రమాణ స్వీకారం సమయంలో జెడ్పీ చైర్మన్ మీడియా ముందు చెప్పాడని, ఇప్పుడు దేవుడు దయ్యం అయ్యాడా..? అంటూ దుయ్యబట్టారు. మంత్రి నిరంజన్‌రెడ్డిని గతంలో కంటే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నారు. రాజీనామా పత్రాలను మంత్రి నిరంజన్‌రెడ్డి లేదా జిల్లా అధ్యక్షుడికి ఇవ్వాలి.. కానీ, ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. రేపటిలోగా ఇవ్వకుంటే పార్టీ నుంచి తామే సస్పెండ్ చేస్తామని ప్రకటించారు.
జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్ మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్ ఎన్నోసార్లు మూర్ఖంగా వ్యవహరించి.. తరువాత మంత్రి నిరంజన్‌రెడ్డికి క్ష మాపణలు చెప్పాడన్నారు. మీ వ్యక్తిగత అవసరాల కోసం బీఆర్ఎస్ ను బద్నాం చేస్తున్నారని, మాజీ ఎమ్మెల్యేలు మీ వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు.
ఖిల్లాఘణపురం ఎంపీపీ కృష్ణానాయక్ మాట్లాడుతూ గతంలో ప్ర జాప్రతినిధిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు ప్రతి అభివృద్ధి విషయంలో వేలు పెట్టేవారన్నారు. కానీ, మంత్రి నిరంజన్‌రెడ్డి మాత్రం మండల సమావేశాలు విధిగా నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించి.. అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. ఖిల్లాఘణపురం కా ల్వ గురించి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిరంజన్‌రెడ్డి.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా మంగనూర్ నుంచి ప్రత్యేక కాల్వ ద్వారా ఖిల్లాఘణపురానికి నీళ్లు తెచ్చారన్నారు.
‘నీవు కేవలం కాంట్రాక్టర్ పని మాత్రమే చేశావు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు’ అని మేఘారెడ్డికి చురకలంటించారు. సమావేశంలో పార్టీ శిక్షణ తరగతుల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్, జెడ్పీటీసీలు రఘుపతిరెడ్డి, భీమయ్య, భార్గవి, శంకర్‌నాయక్, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ సువర్ణ, ఎంపీటీసీలు ధర్మనాయక్, శశిరేఖ, ధర్మశాస్త్రి, రాజేశ్వరి, వెంకటయ్య, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు మాణిక్యం, రాములు, కోదండం, వెంకటస్వామి, మండల యువజన సంఘం అధ్యక్షుడు రాము, నాయకులు రవి, జోహెబ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.