వనపర్తి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా దవాఖానలో వై ద్యులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రోగులకు సరైన వైద్యసేవలందడం లేదు. మొత్తం 218 పోస్టులకుగానూ 65 మంది మాత్రమే విధులు నిర్వర్తిసున్నారు. 153 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పక్షం రోజులుగా ఏ దవాఖానలో చూసినా జ్వర వ్యాధిగ్రస్తులతో నిండిపోతున్నాయి. వనపర్తి జిల్లా దవఖానకు ని త్యం 500 నుంచి 800 మంది వరకు రోగులు వస్తున్నారు. 450 పడకలతో ఉన్న ఈ దవాఖానకు రోగుల తాకిడి పెరిగింది. సాధార ణ జ్వరాలతోపాటు మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి కేసు లు వస్తున్నాయి. జిల్లాలోని పది గ్రామాల్లో డెంగీ వ్యాధి లక్షణాలున్న వారిని గతంలో వైద్య శాఖ గుర్తించింది.
అయితే, జూలై నుంచి ఐదు డెంగీ కేసులను మాత్రమే గుర్తించగా.. మిగిలిన కేసు లు అంతకుముందున్న నెలల్లో నమోదయ్యాయి. అలాగే, వానకాలం సీజన్‌కు ముందే మదనాపురం మండలం దంతనూరు గ్రామంలో చికున్‌గున్యాకు కేసు నమోదైంది. అక్కడ ప్రత్యేక శిబి రం ఏర్పాటు చేసి వ్యాధి నివారణ చర్యలు చేపట్టారు. వ్యాధులను గుర్తించిన గ్రామాల్లో దోమల నివారణ, మందుల పిచికారీ వంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే, అనధికారికం గా డెంగీ, చికున్‌గున్యా కేసులు అధికంగా నమోదవుతున్నట్లు స మాచారం. సర్కార్ దవాఖానల్లో ఈ రోగుల అలికిడి కనిపించకపోగా.. రోగులంతా ప్రైవేట్ దవాఖానలకు క్యూ కడుతున్నారు.
వేధిస్తున్న మందుల కొరత..
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో సర్కారు దవాఖానల్లో మందుల కొరత వేధిస్తున్నది. వీటిపై వైద్యసిబ్బంది స్పందించడం లేదు. మందులు, సూదుల కోసం బయటకు వెళ్లాల్సి వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ జ్వరాలకు మా త్రమే మందులు ఇస్తుండగా..ముఖ్యమైన వాటికి మాత్రం చీటీలు రాసి బయట తెచ్చుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ల్యాబ్ సేవలకు ఒక్కో రోగిని రెండు, మూడు రోజులు తిప్పించుకుంటున్నారు. దీంతో వివిధ గ్రామాల నుంచి వచ్చే బాధితులకు కష్టంగా మారుతున్నది.
రిపోర్టులకు మూడు రోజులైతున్నది..
దమ్ము, ఆయాసం వస్తుందని వనపర్తి జిల్లా దవాఖానకు సోమవారం వచ్చాను. మూడు రకాల పరీక్షలు చేశారు. కానీ రిపోర్టులు ఇవ్వలేదు. మంగళవారం వెళ్తే రెండు రిపోర్టులు మాత్రమే ఇచ్చి మళ్లీ రమ్మన్నారు. మందులు కూడా కొన్నే ఇస్తున్నారు. మరికొన్నింటిని బయట దుకాణాల్లో తెచ్చుకోవాలని చెబుతున్నారు. రిపోర్టులు అదేరోజు ఇస్తే మాలాంటి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఒక్కదాని కోసం రోజుల తరబడి తిరగాలంటే ఎలా. చేసే వైద్యం ఏదో ఒక్క రోజే చేస్తే బాగుంటుంది. ఈ తిరుగుడుతోనే పెద్ద బాధ ఉన్నది.
– బాలకిష్టమ్మ, పామిరెడ్డిపల్లి, పెద్దమందడి మండలం, వనపర్తి జిల్లా