గండీడ్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితా నమోదులో ( Voter registration ) పాల్గొనేలా బీఎల్వోలు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఈఆర్వో , ఆర్డీవో వాసు చంద్ర ( RDO Vasuchandra ) అన్నారు. శుక్రవారం గండీడ్ మండల పరిధిలోని వెన్నాచెడు సాయిరాం ఫంక్షన్ హాల్లో బీఎల్వోలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటరు నమోదులో భాగస్వామ్యం చేయాలన్నారు. ఓటరు నమోదులో తప్పులు, ఇంటిపేరు, అడ్రస్ మార్పు, ఫోటో మార్పు కోసం దరఖాస్తులు చేసుకునేలా బీఎల్వోలు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మల్లికార్జున రావు, డిప్యూటీ తహసీల్దార్ మాధవి, బీఎల్వోలు పాల్గొన్నారు.