మహబూబ్నగర్ అర్బన్, నవంబర్ 16: జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రూరల్ ప్రీమియం లీగ్- 2024, గ్రామోత్సవం వాలీబాల్ పోటీలు శనివారం ఉత్సాహంగా కొనసాగాయి.
పోటీలకు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి 40 జట్లు పాల్గొన్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి రమేశ్ తెలిపారు. విజేతగా నిలిచిన జట్లకు డీవైఎస్వో శ్రీనివాస్, డీఎఫ్వో సత్యనారాయణ, పశువర్ధక శాఖ అధికారి మధుసూదన్గౌడ్, రాజగోపాల్, పీడీ వేణుగోపాల్, వడెన్న బహుమతులు ప్రదానం చేశారు.