దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. జిల్లావ్యాప్తంగా ఆయన జయంతిని గురువారం ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలో స్మామిజీ విగ్రహానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వివేకానంద జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు వివేకానందుడి విగ్రహం, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 12