హన్వాడ జూన్ 23 : విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే..మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని టంకర గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 230 మంది విద్యార్థులు చదువుకుంటుండగా ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు.
వెంటనే విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయుల నియమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. పూర్తిస్థాయిలో సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులు ఎలా చదువుతారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టంకర గ్రామస్తులు పాల్గొన్నారు.