Telangana | కోడేరు, జూలై 22 : ఏదైనా ఊర్లోని మనుషులకు వివిధ పేర్లు ఉంటాయి..ఒకటే పేరు ఇద్దరు, ముగ్గురికి ఉండడం తక్కువగా చూస్తుంటాం.. అయితే కోడేరు మండలం జనుంపల్లి మాత్రం ఇందుకు విరుద్ధం.. ఈ పల్లెలో అందరి పేర్లు గ్రామ దేవత నామకరణంతో ఉంటాయి. ‘మ’ అక్షరం వచ్చేలా ఇంటికో మంత్రాలమ్మ, మంత్రాలయ్య ఉన్నారు. 93 మంది పురుమషులకు మంత్రాలయ్య, మంతయ్య, పెద్దమంతయ్య, నడిపి మంతయ్య, 135 మంది మహిళల పేర్లు మంత్రాలమ్మ, మంతమ్మ, చిన్నమంతమ్మ, పెద్దమంతమ్మ, నడిపి మంతమ్మ, వీరే కాకుండా ఇంకా 18 ఏండ్లలోపు బాలబాలికలు సుమారు 50 మందికి ఇలాంటి పేర్లే ఉన్నాయి. గ్రామ దేవత మంత్రాలమ్మ దేవతపై ఉన్న భక్తి, విశ్వాసంతోనే అక్కడి వారికి తల్లిదండ్రులు అమ్మవారి పేరు వచ్చేలా నామకరణం చేస్తున్నారు. కొన్నేండ్లుగా ఇదే ఆనవాయితీ సాగుతుందని అక్కడి వారు చెబుతున్నారు.
కోరిన కోరికలు తీర్చే గ్రామ దేవతగా విరాజిళ్లుతున్న మంత్రాలమ్మ మహత్యం అంతా ఇంత కాదు.. ఆ గ్రామంలో దేవత పేరుపై నాయకరణం చేయటం కొన్నేండ్లుగా ఆనవాయితీగా వస్తున్నది. నాటి నుంచి నేటి వరకు ‘మ’ అన్న అక్షరంతోనే పేరు పెట్టుకోవడం అక్కడి ప్రజల ఆచారంగా భావిస్తున్నారు. ఇంటి ఇలవేల్పుగా భావించే గ్రామ దేవత మంత్రాలమ్మ పేరు మీద మంత్రాలమ్మ, మంతయ్య, మంతమ్మ, మంత్రాలయ్య అన్న పేర్లు దాదాపు ప్రతి ఇంటిలో ఒకరు పెట్టుకుంటారు. గ్రామ దేవతపై ఉన్న భక్తితో ఆ గ్రామంలోని ప్రజలు ఇలా పేర్లు పేర్లు పెట్టుకుంటున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం జనుంపల్లి గ్రామంలో అంతా ‘మ’ అక్షరంతో పేర్లు ప్రారంభమవుతాయి. అత్యధికంగా ఇక్కడి వారు వారి సంతానికి మంత్రాలమ్మ, మంత్రాలయ్య పేర్లు పెట్టుకున్నారు. గ్రామ శివారులో వెలిసిన మం త్రాలమ్మ దేవతకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి మా సాల్లో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. మంత్రాలమ్మ దేవతపై ఆ గ్రామ ప్రజలకు ఉన్న భక్తి విశ్వాసాలకు నిదర్శనం. గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒకరికి దేవత పేరు కలిసివచ్చేలా నామకర ణం చేస్తుంటారు. గ్రామ జనాభా 2,640 మంది ఉండగా.. ఇందులో 1,340 మంది పురుషులు, 1,300 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 93 మంది పురుషులు మంత్రాల య్య, మంతయ్య, పెద్దమంతయ్య, నడిపి మంతయ్య, అనే పేర్లు ఉన్నాయి. మరో 135మంది మహిళల పేర్లు కూడా మంతాలమ్మ, మంతమ్మ, చిన్నమంతమ్మ, పెద్దమంతమ్మ, నడిపి మంతమ్మ పేర్లతో పిలువబడుతున్నారు. ఇంకా 18 ఏండ్ల వయస్సులోపు సుమారు 50 మంది వరకు ఉన్నారు. దేవతపై ఉన్న భక్తి విశ్వాసంతోనే తమ పిల్లలలకు అమ్మవారి పేరు వచ్చేలా చూ స్తున్నామని ప్రజలు చెబుతున్నారు. గ్రామ దేవత పేరుతో త మ పిల్లలకు పేర్లు పెట్టుకోవడం ఆ దేవతపై ఉన్న భక్తి భావమేనని పలువురు పేర్కొంటున్నారు.
అమ్మవారి దీవెనలు ఉండాలి
మంత్రాలమ్మ దీవెనలు ఉండాలనే నాకు కూడా మంత్రాలయ్య అనే పేరు పెట్టారు. మా గ్రామంలో ఎక్కువ శాతం అమ్మవారి పేరు కలిసివచ్చేలా నామకరణం చేస్తారు. ఇంట్లో దాదాపు ఒక్కరికైనా అమ్మ వారి పేరు ఉంటది.
చనిపోతున్నారని..
మా ఇంట్లో పుట్టిన చాలా మంది చనిపోతున్న సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రాలమ్మ దేవత పేరు పెట్టారు. పుట్టిన ప్రతి బిడ్డ చనిపోతుంటే గద్దె అడిగారట. మంత్రాలమ్మ దేవత పేరు చెప్పడంతో నాకు మా తల్లిదండ్రులు మంత్రాలమ్మ పేరు పెట్టారు.
– గొల్ల బోడ మంతమ్మ, జనుంపల్లి