Unidentified Dead Body : పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. యామ్నంపేటలోని శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలోని పొదల్లో కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. యూనివర్సిటీ సిబ్బంది సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు.. అత్యాచారం అనంతరం హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృతదేహం లభించింది. శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలోని పొదల్లోంచి దుర్వాసన వస్తుండడంతో.. సిబ్బంది సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మెడపై అనుమానాస్పద ఆనవాళ్లు గుర్తించారు. హత్యాచారం జరిగి ఉండవచ్చిని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చని, సుమారు వారం రోజుల క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి గుర్తింపు కోసం పరిసర ప్రాంతాల్లో ఆరా తీశారు. అయితే.. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల తర్వాత ఆమె హత్యకు అసలు కారణాలు బయటపడే అవకాశముంది.
పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మృతదేహం కలకలం
యామ్నంపేటలోని శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలో పొదల్లో కుళ్లిన స్థితిలో గుర్తింపు
యూనివర్సిటీ సిబ్బంది సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు
హత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానం..… pic.twitter.com/h260OWKkhR
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2026