Konda Surekha : రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ(Konda Surekha)కు వరసగా షాక్‌లు ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా ఆమోదంతో దేవాదాయ శాఖ మంత్రి పదవిని కోల్పోయిన ఆమె భద్రతను కుదించింది ప్రభుత్వం. శుక్రవారం సురేఖకు కేటాయించిన గన్మెన్లను వెనక్కి పిలిచిన అధికారులు.. ఆమె నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో, ఢిల్లీ పెద్దల నిర్ణయంతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఆమె భద్రతను కుదించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 3, గురువారం ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినందున గన్మెన్లను వెనక్కి పిలిచింది సర్కార్.
మొన్నటి వరకూ మంత్రి హోదాలో సురేఖకు ఉన్న 4 4 భద్రతను మొత్తంగా తీసేశారు అధికారులు. అంతేకాదు ఆమెకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అన్యాయంగా తనను తొలగించారని మండిపడుతున్న సురేఖ ఈ నిర్ణయాలతో మరింత ఆగ్రహాంతో ఉన్నారని సమాచారం.