Himalayan 440 | భారత మార్కెట్లోకి హిమాలయన్ 440.. భారీ ఇంజిన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో బండి భలేవుంది..!
Himalayan 440 : మోటార్ సైకిళ్ల దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో బైక్ వచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునేలా హిమాలయన్ 440 (Himalayan 440) రకాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది కంపెనీ.
Himalayan 440 : మోటార్ సైకిళ్ల దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో బైక్ వచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునేలా హిమాలయన్ 440 (Himalayan 440) రకాన్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది కంపెనీ. లాంగ్ డ్రైవ్, అడ్వెంచర్ టూర్లకు వెళ్లే వారికి ఈ బండి చాలా సౌకర్యంగా ఉంటుందని సంస్థ పేర్కొంది. భారీ ఇంజిన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపొందిన ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.29 లక్షలు ఉందని సంస్థ వెల్లడించింది. హిమాలయన్ నేమ్ ప్లేటును తీసుకొచ్చి పదేళ్లకు గుర్తుగా ఈ వెరైటీని 443సీసీ ఇంజిన్, అప్డేడెట్ ఫ్రేమ్‌తో తీసుకొచ్చామని సంస్థ తెలిపింది.
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ హిమాలయన్ 440 రకాన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారి సౌకర్యార్థం 2016లో తొలిసారి హిమాలయన్ వేరియంట్‌ను తీసుకొచ్చిన కంపెనీ.. పదేళ్లకు గుర్తుగా 440ను 430 సీసీ ఇంజిన్‌తో తీసుకొచ్చింది. సెప్టెంబర్ 4వ తేదీ, శుక్రవారం నుంచే కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఈ బండి సెలా బ్లాక్, ముస్తంగ్ బ్రౌన్, నెలాంగ్ వైట్.. ఈ మూడు రంగుల్లో లభించనుంది.
The new @royalenfield Himalayan 440 is here, and this reel is all about its exhaust note. The motorcycle gets a new 443cc long-stroke engine, paired with a six-speed gearbox.
What do you think of the sound? Is this the kind of exhaust note you would want from an adventure… pic.twitter.com/BMINbeQKVk
— OVERDRIVE (@odmag) September 4, 2026
ఇంజిన్, ఇతర ప్రత్యేకతలు
హిమాలయన్ 440 రకం బండిలో సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 430సీసీ సామర్థ్యమున్న ఈ వేరియంట్..6,250 ఆర్పీఎమ్ వద్ద 25.4 బీహెచ్పీ, 4వేల ఆర్పీఎమ్ వద్ద 34ఎన్ టార్క్‌ను విడుదల చేస్తుంది. మోటార్ విషయానికొస్తే.. ఆరు స్పీడ్ గేర్ బాక్స్లుంటాయి. ఫ్రేమ్ ప్రత్యేకత ఏంటంటే.. హాఫ్ డుప్లేక్స్ క్రాడిల్ ఫ్రేమ్స్, సస్పెన్షన్ 41 ఎంఎం టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్.. 200 ఎంఎం, 180 ఎంఎం ట్రావెల్‌కు అనువుగా ఉంటుంది. కొత్త హెడ్‌ల్యాంప్, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పాయింట్, 15 లీటర్ల ఇంధనం పట్టేంత ట్యాంక్ దీని సొంతం. ఎక్స్ షోరూమ్ ధర రూ.2.29 లక్షలు అని కంపెనీ స్పష్టం చేసింది.
.@royalenfield Himalayan 440 launched at Rs 2.29 lakh; shares engine and transmission with the Scram 440.
Tap below for more info: https://t.co/mVAWXi8qOy
— Autocar India (@autocarindiamag) September 4, 2026
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

