హన్వాడ, సెప్టెంబర్ 26: టీవీలు, పేపర్లలో చూసినం.. గప్పుడు సీఎం కేసీఆర్ సారూ తెలంగాణ వస్తే మనమందరం బాగుపడుతాం అండ్రి.. ఏమో అనుకున్నాం…గిప్పుడు మీరు మాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా వచ్చినప్పుడు చూసినం. మా గుండెల్లో సీఎం కేసీఆర్, మీరు (మంత్రి శ్రీనివాస్‌గౌడ్) తప్పా ఎవరూ లేరు. మా ఓట్లన్నీ మీకే వేస్తాం.. మీరు ఎంత అభివృద్ధి చేయాలకున్నారో అంత ధైర్యంగా చేయండి.. అంటూ హన్వాడ మండలం అంబటోనిపల్లి మహిళలు, గ్రామస్తులు కలిసికట్టుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌ను నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టాలని, తాము ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటామన్నారు.