మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేశారు. శనివారం శమీ వృక్షాలకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు శమీపూజ అనంతరం జమ్మిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు అందించి ఆత్మీయతను చాటుకున్నారు. అలాగే పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.