గద్వాల, అక్టోబర్ 8 : కేసీఆర్ సర్కారు పాలనలో విజయ డెయిరీ లాభాల బాటలో నడిచింది. రైతులకు వ్యవసాయంతోపాటు అదనపు ఆదాయం స మకూర్చడంలో భాగంగా వారి సహకారంతో విజ య డెయిరీని బలోపేతం చేసింది. రైతులను నిలువునా దోచుకునే ప్రైవేట్ డెయిరీలకు అడ్డుకట్ట వేసేందుకు పాల ధరలను పెంచి చేయూతనందించింది. గత ప్రభుత్వంలో విజయ డెయిరీ లాభాల బాటలో పయనించగా.. నేడు కాంగ్రెస్ పది నెలల పాలనలోనే నష్టాల ఊబిలోకి నెట్టింది. ప్రస్తుతం విజయడెయిరీకి పాలు పోసే పాడి రైతులకు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ డెయిరీల వైపు మొగ్గు చూపుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగునీరు పుష్కలంగా ఉండడంతో అన్నదాతలు సాగుతోపా టు ప్రతి ఇంటికీ ఆవులు, పాడిగేదెలను పెంచుకుం టూ అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. భూములన్నీ సాగులోకి రావడంతో పశువుల మేతకు కూడా కొదవ లేదు. అయితే, ప్రస్తుతం రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, పాల డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు. పాడిగేదెల ద్వారా వచ్చే ఆదాయంతోనైనా కుటుంబాన్ని పోషించుకుందామంటే పాలబిల్లులను కూడా చెల్లించకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
నాడు 4 వేలు.. నేడు 1,100 లీటర్లు..
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న విజయ డెయిరీకి సుమారు 1,500 మంది రైతులు పాలు పోస్తున్నారు. అయితే, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ డెయిరీకి నిత్యం సుమారు 3,500 నుంచి 4 వేల లీటర్ల వరకు పాలు పోసేవారు. దీనికితోడు పాడి రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనతో కేసీఆర్ సర్కారు పాల ధర పెంచి వారికి చేయూతనందించింది. దీనిని కొనసాగించాల్సిన రేవంత్ సర్కారు పూర్తిగా విస్మరించింది. పాడి రైతుల బిల్లులు చెల్లించడంలో గత డిసెంబర్ నుంచి జాప్యం చేస్తూ వస్తున్నది. పదిరోజులకోసారి బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. 70 రోజులకు చెందిన ఏడు బిల్లులను పెండింగ్లో ఉంచింది. ఈ క్రమంలో జిల్లాలో రైతులకు సుమారు రూ.30 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉన్నది.
బిల్లుల చెల్లింపుల్లో జాప్యం..
పాడి రైతుల బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేస్తుండడంతో రైతులు పాడి పశువుల దాణా, గడ్డి, కూలీలకు డబ్బులిచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాడిరైతులు కేవలం బిల్లులపై ఆధారపడి ఉండడంతో ప్రస్తుతం తమ పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేక సతమతమవుతున్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ ఇటీవల పాడి రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి.., కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుంటే విజయ డెయిరీకి పాలు బంద్ చేసి.. ప్రైవేట్ వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నామన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే నిరాహార దీక్షలకు సిద్ధంగా ఉన్నామని పాడి రైతులు హెచ్చరిస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం..
పది రోజులకు రూ.35 వేల వరకు బిల్లు వచ్చేది. ప్ర స్తుతం ఆరు విడుతల్లో కలిపి రూ.2 లక్షలు రావాల్సి ఉన్న ది. కాం గ్రెస్ ప్రభుత్వం గత 70 రోజులుగా బిల్లులు చె ల్లించకపోవడంతో ఇబ్బందు లు పడుతున్నాం. పశువులకు మేత, దాణా కొనుగోలు చేయలేకపోతున్నాం. కుటుంబపోషణ కష్టతరమైంది. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. పా ల అమ్మకం మీదే మే ము ఆధారపడి ఉన్నాం. రే వంత్రెడ్డి సర్కారు పాడి రైతులను పూర్తిగా విస్మరించింది. రుణమాఫీ, రైతుభరోసా కూడా ఇవ్వలేదు – మన్నెం, పాడి రైతు, గద్వాల