కల్వకుర్తి రూరల్ : రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) మృతి చెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు రాస్తారోకో ( Rastaroko ) నిర్వహించారు. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సమీపంలో లారీ, బైకును ఢీకొన్న సంఘటనలో చరణ్ కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. అతడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గురువారం కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా జూపల్లి గ్రామస్థులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా బాధితుడి కుటుంబానికి ఏమాత్రం న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారకుడు లారీ డ్రైవర్ను పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. పోలీసు అధికారులు తమకు ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు.
పోలీస్ అధికారులు స్పందించి చరణ్ కుమార్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని రోడ్డుపై బైఠాయించారు. చరణ్ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు రాస్తారోకో విరమించేది లేదని , రహదారిపై బైఠాయించారు. కార్యక్రమంలో జూపల్లి గ్రామస్థులు, చరణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.