దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట) డిసెంబర్ 2: పాలమూరు జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని సప్త గిరులలోని కాంచన గుహలో కొలువైన స్వయంభూ వేంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన కురుమూర్తిరాయుడి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి.
కార్తీకమాసం శనివారం పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్దఎత్తున కురుమూర్తి కొండకు తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించారు. దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.