మహబూబ్‌నగర్, జూన్ 28 : కూరగాయల ధరలు పేదలకు రోజురోజుకూ అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. పప్పుచారు తింటూ కాలం వెల్లదీ స్తూ కూరగాయల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. జిల్లాకేంద్రంలోని రైతుబజార్ ధరల పట్టిక లో రేట్లు తక్కువగానే ఉన్నా.. రైతుల వద్ద అవసరమైనన్ని కూరగాయలు లేకపోవడంతో వ్యాపారస్తు లు దండుకుంటున్నారు. తక్కువ ధర ఉన్న కూరగాయలను సైతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. పాలమూరు రైతుబజార్‌కు పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు కూ రగాయలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గడిచిన వారంలో రెండ్రోజులు టమాటతోపాటు మరికొన్ని కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలించే వాహనాలు కూరగాయలను తీసుకురాలేదు. దీంతో ఉన్నట్టుండి ఒక్క రోజులోనే టమాట రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయించారు. మరుసటి రోజు నుంచి రోజు మాదిరిగానే కూరగాయాల సరఫరా జరుగుతున్నా వ్యాపారులు మా త్రం ధరలను తగ్గించడం లేదు. అధికారులు సైతం ఏమీ పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు సూచిస్తున్నా..
ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ముందునుంచే సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో అధికారులు సైతం గతేడాది నుంచి రైతుల కు అవగాహన కల్పించారు. ఆరుతడి పంటలతో మంచి లాభాలున్నాయి. ఇప్పటికైనా రైతులు నూ తన విధానాలను అవలంబిస్తూ కూరగాయలను సాగు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
అధిక ధరలకు కారణాలు..
కూరగాయలు ధరలు పెరిగేందుకు ప్రత్యేక కారణాలున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూరగాయలు సరఫరా అవుతాయి. పాలమూరుకు కూరగాయ లు కర్నూల్ నుంచి ఎక్కువగా సరఫరా అవుతా యి. కాగా వారం నుంచి కర్నూల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో వర్షం కారణంగా సరఫరా ఆగిపోయింది. దీంతో బెంగళూరు, హైదరాబాద్ నుంచి మాత్రమే మహబూబ్‌నగర్‌కు కూరగాయలు వ స్తున్నాయి. వర్షాల రాకతో కూరగాయల పం టలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ధరలు పెరిగేందుకు ఇది కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు.
తప్పని పరిస్థితుల్లో కొంటున్నా ..
ఇంట్లో వాళ్లు కూరగాయలు తీసుకురమ్మంటారు. దీంతో ఎంత ఖర్చయినా పెట్టి తీసుకుపోవాల్సి వస్తోంది. రేట్లు చూస్తే భగ్గుమంటున్నాయి. ధరల పట్టికలో ఉన్న దానికి.. వ్యాపారులు అమ్మే దానికి సంబంధమే లేదు. టమాట రూ.70 అని రాసిండ్రు. కొనేందుకు పోతే రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నరు. ఎవరికి చెప్పా లి? ఏమి తినాలో అర్థం కావ డం లేదు. కూరగాయల ధర లు అందరికీ అందుబాటు లో ఉండేలా చూస్తే బాగుంటుంది.
– దొబ్బలి మహేందర్, వినియోగదారుడు, మహబూబ్‌నగర్
ఇలా అయితే కొనుక్కోలేం!
డబ్బులను బట్టి ఏదో ఒకటి కొనుక్కోవాలి. మార్కెట్లో రేట్లు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. జర కూరగాయల రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. సారోళ్లు కొంచం పట్టించుకుని ధరలు తగ్గించాలి. ఇలా అయితే కూరగాయలను కొనుక్కోలేం. – రాములమ్మ, హన్వాడ మండలం, వినియోగదారురాలు