వెల్దండ : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని బ్రహ్మగిరి ఆలయంలో బుధవారం శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి( Veerabrahmendra Swamy ) ఆరాధన ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన, అభిషేకం మహా యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు అన్నదానం కృష్ణయ్య చారి, శ్రీరామదాసు, శ్రీశైలంచారి, శ్రీనివాసచారి పురుషోత్తం చారి, అంజయ్య చారి, చెన్నయ్యా చారి, అన్నదానం మల్లేష్ చారి, జగన్ చారి, రామాచారి, పాండు చారి, శ్రీనివాస్ చారి, జంగాచారి, ప్రసాద్ చారి తదితరులు ఉన్నారు.