భూత్పూర్, డిసెంబర్ 30 : రాష్ట్రంలో, దేవరకద్ర నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్నాసాగర్ గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో శుక్రవారం చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన 100 మందికిపైగా నాయకులు ఎమ్మెల్యే ఆల సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.
వీరికి కండువాలు కప్పి స్వాగతించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, సీఎంఆర్ఎఫ్, దళితబంధు పథకాలను ప్రవేశపెట్టి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము, ఉమామహేశ్వరరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.