మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 17 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి తెలిపారు. తమ కళాశాల విద్యార్థులు జే.శివ 94.03, కౌశిక్ 85.40 పర్సంటైల్ సాధించారన్నారు. వీరితోపాటు మరికొంత మంది విద్యార్థులు అత్యుత్తమ పర్సంటైల్ సాధించి అడ్వాన్స్‌కు ఎంపికయ్యారని తెలిపారు.
ఉత్తమ పర్సంటైల్ సాధించిన వారిని మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరస్పాండెంట్ ప్రత్యేకంగా అభినందించారు. ఏప్రిల్‌లో జరిగే రెండో విడుత జేఈఈలో కూడా అత్యుత్తమ పర్సంటైల్ సాధించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఐఐటీ, నీట్ అకాడమీ ఇన్చార్జి పావనిరెడ్డి, ప్రిన్సిపాల్ గీతాదేవి, అధ్యాపకులు రాఘవేంద్రరావు, షాకీర్, యాకూబ్, సందీప్, గోవిందరాజులు, రాంరెడ్డి, మహేశ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.