మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 14 : నీట్ యూజీ-2025 పరీక్షా ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి తెలిపారు. నీట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శనివారం కళాశాలలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85మంది విద్యార్థుల్లో 38పైగా మెడికల్ సీట్లు సాధించారన్నారు.
వన్క్లాస్ ప్రత్యేక ప్రోగ్రాంతో ఇన్నోవేటీవ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్‌తో నాణ్యమైన విద్యను అందించి జాతీయస్థాయిలో మేముసైతం అంటూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినట్లు తెలిపారు. సాధారణ విద్యార్థులను సైతం డాక్టర్లుగా మార్చిన ఘనత వాగ్దేవి కళాశాలకు దక్కిందన్నారు. ఇంతటి ఘన విజయానికి అధ్యాపకుల సమిష్టి కృషి ప్రధాన కారణమన్నారు.
మట్టిలో మాణిక్యాలై ఆర్థికంగా వెనుకబడిన కొందరు నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తూ వారి కళలను నిజం చేస్తూ డాక్టర్లుగా ఎదిగేందుకు బంగారు బాటలు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ నీట్ అకాడమీ ఇన్చార్జి పావనిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గీతాదేవి, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి నందన్‌రెడ్డి, అకాడమీ అడ్వైజర్ యాకుబ్, ఎంసెట్ ఇన్చార్జి షాకీర్, ఎగ్జామినేషన్ ఇన్చార్జి చెన్నయ్య, యాజమాన్య సభ్యులు కోట్ల శివకుమార్, సతీష్‌రెడ్డి, నాగేందర్, రాఘవేంద్రరావు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.