మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 17 : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో నిర్వహించిన ఎప్‌సెట్ ఫలితాలలో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రబ్షా (1946) ర్యాంకు, సన (3982), కౌశిక్ (4035), దుతిశ్రీ(4244), మౌనిక (4522), తిరుపత మ్మ (5853), పాయిల్సింగ్(6461), సంజన(7140), అజీజ్ (9805), స్ఫూర్తి(9927) సాధించారని తెలిపారు. 15వేల ర్యాంకుల్లోపు 24మంది, 20వేల లోపు 35 మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి నందన్‌రెడ్డి, ఎఫ్‌సెట్ ఇన్చార్జి షాకీర్, యాజమాన్య సభ్యులు సతీశ్‌రెడ్డి, అధ్యాపకులు హుస్సేన్, రత్నాకర్, గోవిందరాజులు, షబ్బీర్‌అహ్మద్, మహేశ్‌తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.