మరికల్ : నారాయణపేట జిల్లాలోని మరికల్, కోస్గి, మాగానూర్ కేజీబీవీలు ( KGBVs ) ఇంటర్ కళాశాలలుగా అప్ గ్రేడ్( KGBVs Upgrade ) చేశామని నారాయణపేట జిల్లా జీసీడీవో నర్మదా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరికల్ కేజీబీవీ లో బైపీసీ, అగ్రికల్చర్ క్రాప్ ప్రోడక్ట్ గ్రూపులు, మాగనూరు కేజీబీవీలో బైపీసీ, ఎంఎల్టీ, కోస్గి కేజీబీవీ లో సీఈసీ, ఎంపీహెచ్ డబ్ల్యు ఫిమేల్ గ్రూపులలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని వివరించారు. నారాయణపేట జిల్లాలో 11 కేజీబీవీలకు గాను గతంలో 9 కేజీబీవీ ల్లో ఇంటర్ క్లాసులు కొనసాగుతుండగా ఈ ఏడాది నుంచి మరికల్, మాగనూర్, కోస్గి కేజీవీబీల్లో ప్రారంభంతో మొత్తం 11 కేజీబీవీలలో ఇంటర్ తరగతులు ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు.