Udandapur Villagers | జడ్చర్ల టౌన్, మార్చి 06 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్యాకేజీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉదండాపూర్ నిర్వాసితులు ఇవాళ ప్రాజెక్టు పనులను అడ్డుకొని దీక్ష చేపట్టారు. జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామస్తులు గత కొన్ని రోజులుగా ప్యాకేజీ డబ్బులు ఇవ్వాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఇందుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించి మరోసారి సర్వే చేయించి అర్హులైన వారందరికీ పరిహారం ఇప్పిస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు సర్వే చేపట్టి వారం రోజులైనా పరిహారం డబ్బులు చెల్లించక పోగా.. 21 ఏండ్లు నిండి పెండ్లి అయిన యువకుల కుటుంబాలకు పరిహారం ఇవ్వటం లేదని ఆరోపిస్తూ ..యువకులు ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులను అడ్డుకొని అక్కడే బైఠాయించారు.
తమ డిమాండ్స్ పరిష్కారం అయే వరకు పనులను జరగనివ్వమని నిర్వాసితులు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని నిర్వాసితులతో చర్చలు జరుపుతున్నారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు