R&R Package | జడ్చర్ల : ఆర్అండ్ఆర్ ప్యాకేజీని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామస్తులు రిజర్వాయర్ కట్టపై నిరసన కార్యక్రమం చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఆందోళన ఉధృతం చేశారు. నిరసనలో భాగంగా బుధవారం జడ్చర్ల పట్టణంలో భిక్షాటనకు బయలుదేరారు.
అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లలతో ఉదండాపూర్ నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల ఎంఎల్ఏ అనిరుద్ రెడ్డి ఉదండాపూర్ నిర్వాసితులకు ప్యాకేజీ కోసం ప్రభుత్వానికి అడిగితే స్పందన రాక పోవడం గమనార్హం. గత ఎనిమిది రోజులుగా ఉదండాపూర్లో ఆందోళన చేస్తున్నారు.
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ
మాధవస్వామి గట్టుపై ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల.. గురుకుల పాఠశాలల రాష్ట్ర సెక్రటరీ స్థల పరిశీలన